: మైన‌స్ డిగ్రీల చ‌లిలో పెళ్లి చేసుకున్న జంట‌... అంటార్కిటికాలో జ‌రిగిన‌ మొద‌టి పెళ్లి

బ్రిటిష్ అంటార్కిటికా ప‌రిశోధ‌నా కేంద్రంలో ప‌నిచేసే జూలీ బామ్‌, టామ్ సిల్వ‌స్ట‌ర్‌లు గ‌డ్డ‌క‌ట్టే చ‌లి సాక్షిగా ఒక్క‌ట‌య్యారు. అంటార్కిటికా ప్రాంతంలో జరిగిన మొద‌టి అధికారిక‌ పెళ్లి వీరిదే. ఈ పెళ్లికి వారితో పాటు ప‌నిచేసే 18 మంది స‌హోద్యోగులు అతిథులుగా హాజ‌ర‌య్యారు. గ‌త ప‌దేళ్లుగా పోలార్ ఫీల్డ్ గైడ్స్‌గా ప‌నిచేస్తున్న వీళ్లిద్ద‌రూ ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. `మా ప్రేమ అంటార్కిటికా మంచు సాక్షిగా పుట్టింది. అందుకే మా పెళ్లికి ఇంత‌కంటే మంచి ప్ర‌దేశం ప్ర‌పంచంలో ఎక్క‌డా దొర‌క‌లేదు` అంటూ పెళ్లికూతురు జూలీ బామ్ చెప్పింది. వీర‌ద్ద‌రూ క‌లిసి ప్ర‌పంచంలోని అన్ని దేశాల్లో గ‌ల మంచు ప‌ర్వ‌తాల మీద ప‌రిశోధ‌న చేశారు.

More Telugu News