: వర్షాలు మా చేతిలో ఉండవు... తమిళనాడు డిమాండ్ కు కర్ణాటక స్పందన

కావేరీ నది నుంచి తమ వాటా నీటిని విడుదల చేయాలన్న తమిళనాడు రాష్ట్ర డిమాండ్ ను కర్ణాటక తోసిపుచ్చింది. రిజర్వాయర్లలో నీటి నిల్వలు చాలా తక్కువ స్థాయుల్లో ఉన్నాయని కర్ణాటక జలవనరుల మంత్రి ఎంబీ పాటిల్ చెప్పారు. ‘‘జూలై 1 నుంచి సోమవారం వరకు తమిళనాడుకు 44 టీఎంసీల నీటిని విడుదల చేయాల్సి ఉంది. కానీ 2.2 టీఎంసీలునే విడుదల చేశాం. దీంతో నీటి విడుదలకు తమిళనాడు ప్రభుత్వం ఒత్తిడి తెస్తోంది. వాస్తవానికి మా దగ్గర తగినంత నీరు లేదు" అని చెప్పారు. కావేరీ పరీవాహక ప్రాంతంలో వర్షాలు తక్కువగా ఉన్నాయని, ఇది సహజంగా జరిగేదని, తమ చేతుల్లో ఏమీ ఉండదని అన్నారు. వర్షాలను తాము కురిపించలేమన్నారు. అయినప్పటికీ తమిళనాడుకు నీటి విడుదలను ఆపలేదని స్పష్టం చేశారు. 

More Telugu News