manirathnam: మరో స్టార్ తో ముందుకు వెళుతోన్న మణిరత్నం!

మణిరత్నం ఈ ఏడాది చరణ్ తో ఒక సినిమా చేయాలనుకున్నారు. కానీ కొన్ని కారణాల వలన ఈ ప్రాజెక్టు ఆలస్యమవుతోంది. ఈ నేపథ్యంలో మరో కథతో .. మరో స్టార్ హీరోతో సినిమా చేయడానికి మణిరత్నం రెడీ అవుతున్నారు. గతంలో ఆయన మాధవన్ తో సఖి .. యువ .. అమృత సినిమా చేశారు. ఈ మూడు సినిమాలు ఆడియన్స్ ను ఆకట్టుకోవడమే కాకుండా .. మాధవన్ కెరియర్లో ప్రత్యేకమైన స్థానంలో నిలిచాయి.

అలాంటి మాధవన్ తోనే మరో మూవీని మణిరత్నం ప్లాన్ చేస్తున్నారట. యాక్షన్ థ్రిల్లర్ నేపథ్యంలో ఈ సినిమా కొనసాగుతుందని అంటున్నారు. 'చెలియా' వంటి లవ్ స్టోరీ పరాజయం పాలు కావడం వల్లనే, ఈ సారి ఆయన యాక్షన్ థ్రిల్లర్ ను ఎంచుకున్నారని అంటున్నారు. త్వరలోనే పూర్తి వివరాలు తెలియనున్నాయి.     

More Telugu News