: అబ్బురపరచిన సైనిక విన్యాసాలు: అమెరికా సూపర్ హార్నెట్ యుద్ధ విమానాలతో తలపడ్డ భారత మిగ్ 29కే ఫైటర్ జెట్స్!

బంగాళాఖాతంలో భారత్, అమెరికా నావికాదళాలు, వాయుసేనతో కలసి చేపట్టిన సైనిక విన్యాసాలు అబ్బురపరిచేలా సాగుతున్నాయి. రష్యాలో తయారై, మూడున్నద దశాబ్దాలకు పైగా భారత్ కు సేవలందిస్తున్న మిగ్-29 విమానాలు, మరింత అత్యాధునికతను సంతరించుకుని అమెరికాకు చెందిన సూపర్ హార్నెట్ విమానాలతో తలపడ్డాయి. ఎఫ్-15, ఎఫ్-16 విమానాలతో సమానంగా విన్యాసాలు చేశాయి.

ఐఎన్ఎస్ విక్రమాదిత్యతో పాటు, యూఎస్ కు చెందిన నిమిట్జ్ యుద్ధ నౌకలు ఈ విన్యాసాల్లో పాల్గొనగా, దీనిపై భారత మిగ్-29కే ఫాల్కన్ లు తొలిసారిగా ల్యాండ్ అయ్యాయి. యుద్ధం సంభవిస్తే, ఎలా వ్యవహరించాలి? యాంటీ రాడార్ వ్యవస్థ పరిశీలన, వేగ నియంత్రణ తదితరాలను ఇవి కళ్లకు కట్టినట్టు చూపించాయి. మిగ్-29కే విమానాల విన్యాసాలు అమెరికన్ సైనికులను సైతం కట్టి పడేశాయని విశ్లేషకులు వ్యాఖ్యానించారు. భారత ప్రదర్శన పూర్తి స్థాయి సంతృప్తిని కలిగించిందని రేర్ అడ్మిరల్ విలియమ్ డీ బెర్నీ వ్యాఖ్యానించారు. యుద్ధ విమానాలు ఆకాశంలో పోటీ పడ్డ తీరు అద్భుతమని అన్నారు.

More Telugu News