: రష్యాలో భారీ భూకంపం.. సునామీ హెచ్చరికలు జారీ

రష్యాలో భారీ భూకంపం సంభవించింది. బేరింగ్ ద్వీపం సముద్ర తీరంలో సంభవించిన ఈ భూకంప తీవ్రత 7.8గా నమోదైంది. సముద్రంలో పది కిలోమీటర్ల లోతున భూకంప కేంద్రం ఉన్నట్టు శాస్త్రవేత్తలు గుర్తించారు. తొలుత 7.4 తీవ్రతతో సంభవించిన భూకంపం తీవ్రత కొన్ని క్షణాల్లోనే 7.8కి చేరుకుందని ప్రభుత్వం పేర్కొంది. భూకంప కేంద్రం నుంచి 300 కిలోమీటర్ల పరిధిలో భారీ సునామీ సంభవించే అవకాశం ఉందని సునామీ హెచ్చరికల కేంద్రం అప్రమత్తం చేసింది.

More Telugu News