: ఉభయ రాష్ట్రాల్లోనూ కుమ్మేస్తున్న వర్షాలు.. వాతావరణ శాఖ హెచ్చరికలు!

వర్షాకాలం ప్రారంభమైనా అప్పుడప్పుడు చుట్టపు చూపులా వచ్చి పోతున్న వానలు ఇప్పుడు తెలుగు రాష్ట్రాల్లో తిష్టవేశాయి. గత మూడు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్నాయి. తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లో వర్షాల ధాటికి వాగులు, వంకలు పొంగి పొర్లుతున్నాయి. నదులు ఉప్పొంగి ప్రవహిస్తున్నాయి. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం మరింత బలపడి నేడు (మంగళవారం) వాయుగుండగా మారే అవకాశం ఉందని వాతావరణ శాఖ పేర్కొంది. దీనికి అనుబంధంగా సముద్ర మట్టానికి 7.6 కిలోమీటర్ల ఎత్తులో ఉపరితల ఆవర్తనం ఆవరించింది.

ఇంకోవైపు ఒడిశా నుంచి దక్షిణ తమిళనాడు వరకు కోస్తాంధ్ర, రాయలసీమ మీదుగా అల్పపీడన ద్రోణి కొనసాగుతోంది. వీటి ప్రభావంతో మరో రెండు రోజులు కోస్తాంధ్రలోని కొన్ని ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురుస్తాయని, మరికొన్ని చోట్ల భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు. గంటకు 55  కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని, మత్స్యకారులు చేపల వేటకు సముద్రంలోకి వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు.

 

 
 
 
 

More Telugu News