: ఆదాయం తగ్గినా, ఆడపడుచులకే ఓటు.. బెల్టు షాపులపై చంద్రబాబు కీలక నిర్ణయం

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్నారు. రాష్ట్రంలో బెల్టు షాపులను పూర్తిగా ఎత్తివేయాలని నిర్ణయించారు. ఆదాయం గురించి ఆలోచించకుండా మహిళల అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుని వాటిని సమూలంగా తొలగించాలని నిర్ణయం తీసుకున్నారు. ఈ మేరకు అధికారులను ఆదేశించారు. ఈ నెలాఖరు నాటికి రాష్ట్రంలో ఎక్కడా బెల్టు షాపన్నదే కనిపించకూడదని అధికారులును ఆదేశించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని కాదని ఎవరైనా బెల్టు షాపులు కొనసాగిస్తే కఠిన చర్యలు తీసుకోవాలన్నారు.

సోమవారం సీఎం కార్యాలయంలో నిర్వహించిన తెలుగుదేశం శాసనసభా పక్ష సమావేశంలో బెల్టుషాపుల విషయం ప్రస్తావనకు వచ్చింది. ప్రభుత్వం నిర్వహించిన సర్వేలో బెల్టు దుకాణాలను తొలగించాలని మహిళలు కోరారని చంద్రబాబు తెలిపారు. వారి అభిప్రాయాన్ని గౌరవించి ఆదాయంతో నిమిత్తం లేకుండా వాటిని పూర్తిగా తొలగించనున్నట్టు పేర్కొన్నారు. అలాగే ఇసుక విషయం కూడా ఈ సమావేశంలో చర్చకు వచ్చింది. ఇసుకను ఉచితంగా ఇస్తున్నా రవాణా చార్జీల పేరుతో ఎక్కువ ధరలు వసూలు చేస్తున్నారని తెలిసిందని, కాబట్టి దానికి కూడా ఓ ధరను నిర్ణయిస్తే బాగుంటుందని సర్వేలో పాల్గొన్న వారిలో 40 శాతం మంది అభిప్రాయపడినట్టు ముఖ్యమంత్రి వివరించారు. ఇసుక, మద్యం వ్యాపారాల్లో తలదూర్చవద్దని ఎమ్మెల్యేలకు చంద్రబాబు సూచించారు.

More Telugu News