Rakul: సినిమా కబుర్లు ... సంక్షిప్త సమాచారం

*  తెలుగులో అగ్ర కథానాయికగా ఎదిగిన రకుల్ ప్రీత్ సింగ్ కోలీవుడ్ లో కూడా అలాంటి స్థానాన్ని ఆశిస్తోంది. అందుకే, అక్కడ కూడా దృష్టి పెట్టింది. ఈ క్రమంలో ప్రస్తుతం మహేశ్, మురుగదాస్ కాంబినేషన్ సినిమా కాకుండా కార్తీతో 'ధీరన్ అధిగారం ఒండ్రు' అనే చిత్రం కూడా చేస్తోంది. ఈ రెండూ అక్కడ తనకు మంచి స్థాయిని ఇస్తాయని అమ్మడు ఆశలు పెట్టుకుంది.  
*  మెగా ఫ్యామిలీ హీరో సాయిధరం తేజ్ కథానాయకుడుగా ప్రముఖ రచయిత బీవీఎస్ రవి దర్శకత్వంలో రూపొందుతున్న 'జవాన్' చిత్రం షూటింగ్ ముగింపు దశకు చేరుకుంది. మరోపక్క డబ్బింగ్ కార్యక్రమాలు కూడా జరుగుతున్నాయి. ఇందులో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది.
*  అజిత్ హీరోగా రూపొందుతున్న 'వివేగం' తమిళ చిత్రం తెలుగు అనువాదం హక్కులు భారీ రేటు పలికాయి. సుమారు నాలుగున్నర కోట్లకు ఈ హక్కులు అమ్ముడుపోయినట్టు ట్రేడ్ వర్గాలు చెబుతున్నాయి. వచ్చే నెల 10న తెలుగు, తమిళ భాషల్లో ఒకేసారి విడుదలయ్యే ఈ చిత్రంలో కాజల్ కథానాయికగా నటిస్తోంది.
*  రవితేజ హీరోగా రూపొందుతున్న 'రాజా ది గ్రేట్' చిత్రం షూటింగ్ హైదరాబాదు పరిసరాల్లో కొనసాగుతోంది. అనిల్ రావిపూడి దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రాన్ని అక్టోబర్ 12న రిలీజ్ చేయడానికి డేట్ ఫిక్స్ చేశారు.     

More Telugu News