balakrishna: తెరపైకి మళ్లీ బాలకృష్ణ, బోయపాటి కాంబినేషన్?

బాలకృష్ణ 101వ సినిమాకి కె.ఎస్. రవికుమార్ దర్శకత్వం వహించనున్నాడు. ఈ సినిమాను వచ్చేనెల 3వ తేదీన లాంచ్ చేయనున్నారు. ప్రస్తుతం ఆ దిశగా సన్నాహాలు జరుగుతున్నాయి. ఈ సినిమా తరువాత బాలకృష్ణ .. బోయపాటితో చేసే ఛాన్స్ ఉందనే వార్త బలంగా వినిపిస్తోంది.

 తాజాగా బోయపాటి చేసిన 'జయ జానకి నాయక' సినిమా త్వరలో ప్రేక్షకుల ముందుకు రానుంది. ఈ సినిమా తరువాత ఆయన బాలకృష్ణతోనే చేయనున్నాడని అంటున్నారు. కె.ఎస్. రవికుమార్ తో బాలకృష్ణ చేసే సినిమా మూడు నాలుగు నెలల్లో పూర్తవుతుందట. ఈ లోగా బోయపాటితో మంచి స్క్రిప్ట్ రెడీ చేయించి బాలకృష్ణతో ఓ సినిమా చేయడానికి ఒకరిద్దరు నిర్మాతలు గట్టి ప్రయత్నాలు చేస్తున్నారట. ఆ ప్రయత్నాలు ఎంతవరకూ ఫలిస్తాయో చూడాలి.   

More Telugu News