raviteja: అక్టోబర్ కి వచ్చేస్తోన్న రవితేజ 'రాజా ది గ్రేట్'

ఈ ఏడాది రవితేజ రెండు సినిమాలను పట్టాలెక్కించాడు .. అందులో ఒకటి 'రాజా ది గ్రేట్'. అనిల్ రావిపూడి దర్శకత్వంలో ఈ సినిమా తెరకెక్కుతోంది. ఇప్పటికే 70 శాతం షూటింగ్ పూర్తిచేసుకున్న ఈ సినిమా, మిగిలిన 30 శాతం షూటింగ్ ను పూర్తిచేసే పనిలో వుంది. అక్టోబర్ 12న ఈ సినిమాను విడుదల చేయాలనే ఆలోచనలో వున్నారు.

 చూపులేని వ్యక్తిగా రవితేజ కనిపించనున్న ఈ సినిమాలో మెహ్రీన్ కథానాయికగా నటిస్తోంది. ఇంతవరకూ తాను పోషించిన పాత్రకి .. ఈ పాత్ర పూర్తి భిన్నంగా ఉంటుందని రవితేజ అంటున్నాడు. తన కెరియర్లో ఈ సినిమా ప్రత్యేకమైన స్థానాన్ని దక్కించుకుంటుందనే ఆశాభావాన్ని వ్యక్తం చేశాడు. వరుస హిట్స్ ఇస్తూ వస్తోన్న అనిల్ రావిపూడి .. ఈ సినిమాతో రవితేజకి కూడా హిట్ ఇస్తాడేమో చూడాలి.             

More Telugu News