: కేశవరెడ్డి విద్యా సంస్థలను టేకోవర్ చేసిన శ్రీ చైతన్య

కర్నూలు జిల్లా నంద్యాలతో పాటు తెలుగు రాష్ట్రాల్లోని పలు ప్రాంతాల్లో పాఠశాలలు పెట్టి, విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి డిపాజిట్ల రూపంలో కోట్ల కొద్దీ సేకరించి చేతులెత్తేసిన కేశవరెడ్డి విద్యా సంస్థలను శ్రీ చైత్యన్య టేకోవర్ చేసింది. కేశవరెడ్డి విద్యా సంస్థల్లో చదువుకుంటున్న విద్యార్థుల భవిష్యత్తు దృష్ట్యా ఈ నిర్ణయం తీసుకున్నామని శ్రీ చైతన్య యాజమాన్యం స్పష్టం చేసింది.

మరో మంత్రి ఆదినారాయణరెడ్డికి వియ్యంకుడైన కేశవరెడ్డి, తమ వద్ద డబ్బు డిపాజిట్ చేస్తే, ఒకటి నుంచి పది వరకూ ఉచితంగా చదువు చెబుతామని, చివర్లో ఆ డబ్బును వెనక్కు ఇస్తామని ప్రచారం సాగించి, గడచిన పదిహేను సంవత్సరాల వ్యవధిలో వందలాది మంది తల్లిదండ్రుల నుంచి లక్షల్లో డబ్బులు కట్టించుకుని, వాటిని వెనక్కు ఇవ్వడంలో విఫలమైన సంగతి విదితమే.

More Telugu News