charan: దర్శకుడు కొరటాల శివ పారితోషికం 14 కోట్లా?

కొరటాల శివ దర్శకత్వంలో వచ్చిన 'మిర్చి' ఎంతటి సక్సెస్ అయిందో తెలిసిందే. ఈ సినిమా తరువాత చరణ్ తో కొరటాల ఒక సినిమా చేయాలనుకున్నాడు. బండ్ల గణేశ్ నిర్మాతగా ఆ సినిమాకి సంబంధించిన పనులు కొంతవరకూ జరిగాయి. అయితే కొన్ని కారణాల వలన ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. ఆ తరువాత కొరటాల వరుస బ్లాక్ బస్టర్స్ ఇస్తూ వచ్చాడు. దాంతో మళ్లీ ఆయనతో సినిమా చేయడానికి చరణ్ ఉత్సాహాన్ని చూపాడు.

 కొణిదెల ప్రొడక్షన్స్ .. మ్యాట్నీ ఎంటర్టైన్మెంట్స్ కలసి సంయుక్తంగా, ఈ కాంబినేషన్లో ఓ సినిమాను నిర్మిస్తున్నాయి. ఈ సినిమా కోసం కొరటాల తీసుకుంటున్న పారితోషికం 14 కోట్లని ఫిల్మ్ నగర్లో చెప్పుకుంటున్నారు. హిట్స్ తో పాటే కొరటాలకి డిమాండ్ పెరుగుతూ వచ్చిందనీ, అందుకే ఆయన పారితోషికం ఆ స్థాయిలో ఉందనే టాక్ వినిపిస్తోంది. చరణ్ .. కొరటాల ప్రస్తుతం చేస్తోన్న ప్రాజెక్టులు పూర్తికాగానే, ఇద్దరూ కలిసి సెట్స్ పైకి వెళతారట.      

More Telugu News