: ఎయిర్ ఆసియా విమానాన్ని ఢీకొన్న పక్షి... తృటిలో తప్పించుకున్న 174 మంది

రాంచీ విమానాశ్రయం నుంచి న్యూఢిల్లీకి బయలుదేరిన విమానంలోని 174 మంది ప్రయాణికులు తృటిలో పెను ప్రమాదం నుంచి తప్పించుకున్నారు. మరిన్ని వివరాల్లోకి వెళితే, ఎయిర్ ఆసియాకు చెందిన విమానం బిర్సాముండా ఎయిర్‌ పోర్ట్ నుంచి టేకాఫ్ అయ్యే సమయంలో ఓ పక్షి దాన్ని ఢీకొట్టింది. విషయాన్ని గమనించిన పైలట్ అప్రమత్తమై వెంటనే దాన్ని ఎమర్జెన్సీ ల్యాండింగ్ చేశారు. దీంతో విమానం బ్లేడ్లు దెబ్బతిన్నాయి. చుట్టూ దట్టమైన పొగ రావడంతో, అగ్ని ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయన్న ఆందోళనతో ఎమర్జెన్సీ డోర్ లను తెరచి, ప్రయాణికులను దింపివేశారు. ఈ ఘటనలో విమానం దెబ్బతింది. కాగా, ఈ నెల 1న ఇదే విమానంలో ఓ ప్రయాణికుడు మార్గమధ్యంలో డోర్ తీయబోయిన సంగతి తెలిసిందే.

More Telugu News