: గణితంలో ప్రతిష్ఠాత్మక ఫీల్డ్స్ మెడల్ అందుకున్న తొలి మహిళ మర్యమ్ మిర్జాఖానీ ఇక లేరు!

గణిత పరిశోధనల్లో ప్రతిష్ఠాత్మక ఫీల్డ్స్ మెడల్ అందుకున్న ప్రపంచంలోనే తొలి మహిళ, మొదటి ఇరానియన్ అయిన మర్యమ్ మిర్జాఖానీ మృతి చెందారు. రొమ్ము కేన్సర్‌తో నాలుగేళ్లు పోరాడిన ఆమె ఈనెల 15న 40 ఏళ్ల అతి చిన్న వయసులోనే కన్నుమూశారు. మర్యమ్ మృతి విషయాన్ని శనివారం ఆమె కుటుంబ సభ్యులు ధ్రువీకరించారు. మర్యమ్‌కు భర్త వోండ్రాక్, ఓ పాప ఉన్నారు. వోండ్రాక్ కంప్యూటర్ సైంటిస్ట్.

మిర్జాఖానీ ప్రతిష్ఠాత్మక స్టాన్‌ఫోర్డ్ యూనివర్సిటీలో గణితం బోధించేవారు. అంతకుముందు 2004 నుంచి 2008 వరకు నార్త్ హాంప్‌షైర్‌ పీటర్‌బర్గ్‌లోని క్లే మ్యాథమెటిక్స్ ఇనిస్టిట్యూట్‌లో రీసెర్చ్ ఫెలో గా ఉన్నారు. ప్రిన్స్‌టన్ యూనివర్సిటీలో అసిస్టెంట్ మ్యాథ్స్ ప్రొఫెసర్‌గానూ పనిచేశారు. గణితశాస్త్రంలో ఆమె పరిశోధనలకు గాను 2014లో ఫీల్డ్స్ మెడల్ అందుకున్నారు. 1977లో టెహ్రాన్‌లో జన్మించిన మర్యమ్ తనకు చిన్నప్పటి నుంచి రచయిత కావాలని ఉండేదని ఓ ఇంటర్వ్యూలో పేర్కొన్నారు. అయితే పెద్దన్నయ్య ప్రోత్సాహంతో గణితాన్ని ఎంచుకున్నారు. అంతర్జాతీయ గణిత ఒలింపియాడ్‌లో రెండుసార్లు బంగారు పతకాలు అందుకున్నారు.

More Telugu News