: ప్ర‌తి 50 కి.మీ.ల‌కు ఒక పాస్‌పోర్ట్ సేవాకేంద్రం: మంత్రి ఎంజే అక్బ‌ర్‌

రానున్న రోజుల్లో దేశంలో ప్ర‌తి 50 కి.మీ.ల‌కు ఒక పాస్‌పోర్ట్ సేవాకేంద్రం ఏర్పాటుచేసే యోచ‌న‌లో కేంద్ర ప్ర‌భుత్వం ఉన్న‌ట్లు విదేశీ వ్య‌వ‌హారాల స‌హాయ మంత్రి ఎంజే అక్బ‌ర్ అన్నారు. ఉత్త‌ర కోల్‌క‌తాలో పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవా కేంద్రాన్ని ఆయ‌న ఆవిష్క‌రించారు.

 ఈ సంద‌ర్భంగా నిర్వ‌హించిన కార్య‌క్ర‌మంలో ఆయ‌న మాట్లాడుతూ - `పాస్‌పోర్ట్ ప్ర‌తి భార‌తీయుని హ‌క్కు. ధ‌న‌వంతుడి నుంచి పేద‌వాడి వ‌ర‌కు అంద‌రికీ పాస్‌పోర్ట్ ఉండేలా చూడ‌ట‌మే ప్ర‌ధాని మోదీ, విదేశీ వ్య‌వ‌హారాల మంత్రి సుష్మ స్వ‌రాజ్‌ల ల‌క్ష్యం. ఇంత‌కుముందులా పాస్‌పోర్ట్ కోసం గంట‌ల త‌ర‌బ‌డి లైన్లో నిల‌బ‌డాల్సిన అవ‌స‌రం లేదు. రెండేళ్ల‌లో ప్ర‌తి 50కి.మీ. ల‌కు ఒక పాస్‌పోర్ట్ సేవాకేంద్రం ఉండేలా చర్య‌లు తీసుకుంటాం` అన్నారు. పోస్టాఫీస్ పాస్‌పోర్ట్ సేవాకేంద్రాల్లో కొత్త పాస్‌పోర్టుకు ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు. అలాగే రెన్యూవ‌ల్ కూడా చేసుకోవ‌చ్చు. కానీ త‌త్కాల్‌, ఆన్ హోల్డ్ ఫైల్స్‌, వాకిన్‌, పీసీసీ సేవ‌లు ఇక్క‌డ అందుబాటులో ఉండ‌వ‌ని అక్బ‌ర్ చెప్పారు.

More Telugu News