nayanatara: నయన్ తమిళ మూవీలో సమంత కీలక పాత్ర!

కథల ఎంపిక విషయంలో సమంత మరింతగా ఆచితూచి వ్యవహరిస్తోంది. ప్రస్తుతం తమిళంలో ఆమె 'వేలైక్కారన్' చేస్తోంది. శివకార్తికేయన్ కథానాయకుడిగా దర్శకుడు మోహన్ రాజా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈ సినిమాలో కథానాయికగా నయనతార నటిస్తోంది.

ఇక ఈ సినిమాలో సమంత ఒక కీలకమైన పాత్రను పోషిస్తోందట. ఆమె పోర్షన్ కి సంబంధించిన కొంతభాగం షూటింగును రీసెంట్ గా చిత్రీకరించారని సమాచారం. చాలా సాదా సీదా యువతిగా ఆమె ఈ సినిమాలో కనిపించనుందని అంటున్నారు. ఆహార పదార్థాలలో కల్తీకి పాల్పడుతోన్న ఒక ముఠాపై కథానాయకుడు చేసే పోరాటంగా ఈ సినిమా ఉంటుందని చెబుతున్నారు. నయనతార .. సమంత పోటీపడి నటించే ఈ సినిమాలో, ప్రకాశ్ రాజ్ - స్నేహ ముఖ్యమైన పాత్రలను పోషిస్తూ ఉండటం విశేషం.   

More Telugu News