: టీమిండియా హెడ్ కోచ్ ను నియమించే అర్హత వారికి లేదు: మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్

టీమిండియా హెడ్ కోచ్ గా రవిశాస్త్రిని ఎంపిక చేసే అర్హత సచిన్, గంగూలి, లక్ష్మణ్ లకు లేదని మాజీ చీఫ్ సెలెక్టర్ సందీప్ పాటిల్ సంచలన వ్యాఖ్యలు చేశారు. బీసీసీఐ నియమించిన క్రికెట్ సలహా సంఘానికి హెడ్ కోచ్ ను ఎంపిక చేసే అర్హత లేదని, సచిన్, గంగూలి, వీవీఎస్ లక్ష్మణ్ లు గొప్పఆటగాళ్లే కానీ, వారిలో ఎవరికీ కోచ్ గా అనుభవం లేదని అన్నారు. కోచ్ లు అంపైర్లను నియమించగలరా? అదేమాదిరి, కోచ్ గా అనుభవం లేని వీరు, టీమిండియాకు హెడ్ కోచ్ ను నియమించలేరని విమర్శించారు. హెడ్ కోచ్ నియామక ప్రక్రియను బీసీసీఐ మరొకరికి అప్పగించి చేతులు దులుపుకుందని, ఆ బాధ్యత వారిదేనని విమర్శించారు.

More Telugu News