: నిరాహారదీక్ష చేస్తున్న సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ కు అనారోగ్యం!

ప్రఖ్యాత సైకత శిల్పి సుదర్శన్‌ పట్నాయక్‌ అనారోగ్యానికి గురయ్యారు. కాలుష్యం బారిన పడిన సముద్ర తీరాన్నిశుద్ధీకరించాలని కోరుతూ పూరీలోని బంకిముహనా ప్రాంతంలో నిన్న ఉదయం ఆయన నిరాహారదీక్ష ప్రారంభించారు. అయితే, లో- బీపీకి గురవడంతో పాటు ఆయనకు జ్వరం కూడా వచ్చింది. దీంతో, భువనేశ్వర్ లోని అపోలో ఆసుపత్రికి తరలించినట్టు సుదర్శన్ పట్నాయక్ సన్నిహితుల సమాచారం. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు  వైద్యులు వెల్లడించారు. కాగా, ప్లాస్టిక్‌ బాటిల్స్‌, వ్యర్థాలను తీరం వద్ద వదిలేయడంతో పాటు ఓ మురికి కాల్వను కూడా సముద్రంలోకి వదులుతున్నారు. దీంతో, ఈ ప్రాంతాన్ని కాపాడుకోవాల్సిన అవసరాన్ని చాటిచెపుతూ వివిధ సైకత శిల్పాలను ఆయన రూపొందించారు.

More Telugu News