: ఉద్యోగాలు పోలేదు... బ‌దిలీ మాత్ర‌మే!: లక్నో శాఖ మూసివేతపై టీసీఎస్‌

వ్యాపారం స‌రిగా లేక‌పోవ‌డం వ‌ల్ల ఐటీ దిగ్గ‌జం టీసీఎస్ ల‌క్నోలో త‌మ శాఖ‌ను మూసివేయ‌డం కార‌ణంగా ఎలాంటి ఉద్యోగ న‌ష్టం జ‌ర‌గ‌ద‌ని, లక్నోలో ప‌నిచేసిన వారు ఆ విష‌యం గురించి ఆందోళ‌న చెంద‌న‌క్క‌ర‌లేద‌ని ప్ర‌క‌టించింది. వారిని నోయిడా శాఖకు గానీ లేదా దేశంలో మ‌రేదైనా శాఖ‌కు గానీ బ‌దిలీ చేస్తామ‌ని హామీ ఇచ్చింది. ల‌క్నో శాఖ‌ను మూసివేయ‌డంతో అక్క‌డి ఉద్యోగులు ఉత్త‌ర ప్ర‌దేశ్ ముఖ్య‌మంత్రి యోగి ఆదిత్యానాథ్‌ను క‌లిసి స‌మ‌స్య గురించి వివ‌రించిన సంగ‌తి తెలిసిందే.

ఇలా మూసివేయ‌డం వ‌ల్ల దాదాపు రెండు వేల మంది ఉద్యోగులు రోడ్డున ప‌డ్డార‌ని, వారిలో 50 శాతం మ‌హిళ‌లే ఉన్నార‌ని `సేవ్ టీసీఎస్ ప్లీజ్‌` పేరుతో వారు ఓ లేఖ‌ను స‌మ‌ర్పించారు. వ‌చ్చే ఏడాది ప్ర‌ధాని నియోజ‌క‌వ‌ర్గం వార‌ణాసిలో టీసీఎస్ మ‌రో పెద్ద శాఖ‌ను ప్రారంభించ‌బోతుంది. బ‌హుశా అక్క‌డికి వీరంద‌రిని పంపించే అవ‌కాశం కూడా ఉండొచ్చు.  

More Telugu News