mohanlal: 'భీముడు' పాత్ర కోసం మోహన్ లాల్ కసరత్తు!

మోహన్ లాల్ .. అసమానమైన నటనకి నిలువెత్తు నిదర్శనంగా మలయాళ ప్రేక్షకులు ఈ పేరును చెప్పుకుంటారు. ఎన్నో విభిన్నమైన .. విలక్షణమైన పాత్రలను పోషించిన మోహన్ లాల్ .. 'మహాభారతం'లో భీముడి పాత్రను పోషించనున్నారు. 'మహాభారతం'ను ఈ సినిమాలో భీముడి కోణంలో ఆవిష్కరిస్తారు. అందువలన ముందుగా భీముడి పాత్ర ధారిగా మోహన్ లాల్ ను ఎంపిక చేశారు.

 అప్పటి నుంచి ఈ పాత్రకి తగిన విధంగా కనిపించడానికి మోహన్ లాల్ జిమ్ కి వెళుతున్నారు. హావభావాలను పండించే విషయంలో ప్రిపేర్ అవుతున్నారు. ఈ సినిమా కోసం హాలీవుడ్ యాక్షన్ కొరియో గ్రాఫర్లను తీసుకున్నారు. వాళ్లతో ఈ సినిమా యూనిట్ చర్చలు జరుపుతోంది. శ్రీకుమార్ దర్శకత్వంలో .. 1000 కోట్లతో బీఆర్ షెట్టి నిర్మించే ఈ సినిమాను, భారతీయ భాషలన్నింటిలోను ఒకేసారి విడుదల చేయనున్నారు.        

More Telugu News