tanya hope: 'పటేల్ సర్'పై తాన్య 'హోప్'!

'అప్పట్లో ఒకడుండేవాడు' సినిమాతో తెలుగు తెరకి పరిచయమైన 'తాన్య హోప్' కుర్రకారు మనసు దోచేసింది. అయితే, ఈ సినిమాకి మంచి రెస్పాన్స్ వచ్చినప్పటికీ, ఆమెను వెతుక్కుంటూ అవకాశాలు మాత్రం రాలేదు. దాంతో ఆమె మంచి అవకాశం కోసం .. సరైన సక్సెస్ కోసం ఎదురు చూస్తోంది. ఈ నేపథ్యంలో ఆమె చేసిన సినిమానే 'పటేల్ సర్'.

 రేపు ఈ సినిమా విడుదల కానున్న సందర్భంగా ఆమె మాట్లాడుతూ, 'పటేల్ సర్' లో నటించే ఛాన్స్ రావడం తన అదృష్టమని చెప్పింది. ఈ సినిమాలో తాను పోలీస్ ఆఫీసర్ గా కనిపిస్తాననీ .. తొలిసారిగా ఈ పాత్రలో తనను తాను చూసుకోవడం ఆనందంగా ఉందని అంది. యాక్షన్ థ్రిల్లర్ తో కూడిన ఫ్యామిలీ డ్రామాగా ఈ సినిమా కొనసాగుతుందని చెప్పింది. ఈ సినిమా తన కెరియర్ కి తప్పకుండా హెల్ప్ అవుతుందనే నమ్మకం ఉందంటూ ఆశాభావాన్ని వ్యక్తం చేసింది.   

More Telugu News