charan: ఒక రేంజ్ లో 'రంగస్థలం' ప్రీ రిలీజ్ బిజినెస్!

సుకుమార్ .. చరణ్ కాంబినేషన్లో 'రంగస్థలం 1985' సినిమా తెరకెక్కుతోన్న సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ సినిమా షూటింగు దశలో వుంది. ప్రధానమైన పాత్రలకి సంబంధించిన కొన్ని ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. గ్రామీణ నేపథ్యంలో తెరకెక్కుతోన్న ఈ సినిమాలో కథానాయికగా సమంత నటిస్తోంది. ఈ సినిమా ప్రీ రిలీజ్ బిజినెస్ ఒక రేంజ్ లో జరుగుతోందనే టాక్ వినిపిస్తోంది.

 ఇంతవరకూ ఈ సినిమా 51 కోట్ల వరకూ బిజినెస్ జరుపుకుందని అంటున్నారు. సినిమా రిలీజ్ కి వెళ్లే లోగా 125 కోట్ల వరకూ బిజినెస్ చేయవచ్చని చెబుతున్నారు. ఈ సినిమా శాటిలైట్ హక్కులకు గాను 16 కోట్లు .. ఇతర డిజిటల్ హక్కులకు గాను 13 కోట్లు వచ్చాయని అంటున్నారు. 'ధ్రువ' సినిమాతో 80 కోట్ల వరకూ రాబట్టిన చరణ్, ఈ సినిమాతో 100 కోట్ల క్లబ్ లోకి చేరిపోవడం ఖాయమని అభిమానులు చెప్పుకుంటున్నారు.

More Telugu News