: దోమలపై దండయాత్ర కోసం చేతులు కలిపిన గూగుల్, మైక్రోసాఫ్ట్

జికా సహా ఎన్నో వ్యాధులను వ్యాపింపజేస్తున్న దోమలపై యుద్ధం చేసేందుకు ఐటీ దిగ్గజ కంపెనీలు గూగుల్, మైక్రోసాఫ్ట్ చేతులు కలిపాయి. వీటికి కాలిఫోర్నియా లైఫ్ సైన్సెస్ వంటి కంపెనీలు కూడా జత కలిశాయి. సరికొత్త హైటెక్ టూల్స్ ను అభివృద్ధి చేయడం ద్వారా దోమల ద్వారా వ్యాపించే వ్యాధుల నివారణకు కొత్త మార్గాలను అన్వేషించాలన్న లక్ష్యంతో వీరి టీమ్ ప్రయత్నాలు ప్రారంభించింది. వీరికి అవసరమైన జికా వైరస్ కలిగున్న దోమల కోసం టెక్సాస్ లోని ఓ నిర్మానుష్య ప్రాంతాన్ని మైక్రోసాఫ్ట్ ఎంచుకుని, అక్కడి నుంచి దోమలను సేకరిస్తోంది. ఇక దోమలు సంతానోత్పత్తిని తగ్గించే దిశగా, వాటికి బర్త్ కంట్రోల్ విధానాన్ని కనిపెట్టాలని కాలిఫోర్నియా కేంద్రంగా పనిచేస్తున్న గూగుల్ మాతృసంస్థ ఆల్ఫాబెట్ కు అనుబంధంగా ఉన్న లైఫ్ సైన్సెస్ విభాగం ప్రయత్నాలు ప్రారంభించింది.

ఈ ప్రయత్నాలు విజయవంతం కావాలంటే, మరింత సమయం పట్టవచ్చని యూనివర్శిటీ ఆఫ్ కాలిఫోర్నియా ఎటోమాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ ఆనంద శంకర్ రే అభిప్రాయపడ్డారు. వివిధ ఖండాల్లోని కీటకాలు వివిధ రకాల జన్యు క్రమాలను కలిగుంటాయని, ఓ ప్రాంతంలోని రోగ వ్యాప్తి నివారణా విధానాలు మరో ప్రాంతానికి సరిపడవని అన్నారు. యూఎస్ కు జికా వైరస్ ప్రయాణికుల ద్వారానే వచ్చిందని గుర్తు చేసిన ఆయన, టెక్సాస్, ఫ్లోరిడా ప్రాంతాల్లోని దోమల్లో తొలుత జికా వైరస్ లేదని, విదేశాల నుంచి వచ్చిన వారిని అవి కుట్టిన తరువాతే వ్యాధి వ్యాప్తి చెందిందని చెప్పారు.

More Telugu News