: అంటార్కిటికా నుంచి విడిపోయిన 54,800 చదరపు కిలోమీటర్ల మంచుకొండ.. నౌకలకు ప్రమాదకరం!

ప్రపంచంలో పెను పరిణామం చోటు చేసుకుంది. దక్షిణ ధ్రువంలోని అంటార్కిటికా ఖండం నుంచి పెద్ద మంచు కొండ విడిపోయింది. ఈ మంచుకొండ విస్తీర్ణం ఏకంగా 54,800 చదరపు కిలోమీటర్లు. లక్ష కోట్ల టన్నుల బరువు ఉంటుంది. కొన్ని నెలల క్రితమే ఈ పరిణామాన్ని శాస్త్రవేత్తలు అంచనా వేసినప్పటికీ... అది ఇప్పుడు సంభవించింది. ఈ మంచుకొండ విడిపోవడం వల్ల అంటార్కిటికాలోని లార్సన్ సీ ప్రాంత విస్తీర్ణం 12 శాతం తగ్గిపోయింది. అంటార్కిటికా ఆకృతి శాశ్వతంగా మారిపోయింది. విడిపోయిన మంచుకొండకు ఏ-68 అనే పేరు పెట్టాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. గత మూడు రోజుల వ్యవధిలోనే మంచుకొండ వేరుపడటం జరిగి ఉంటుందని శాస్త్రవేత్తలు చెబుతున్నారు.

ఈ పరిణామం వల్ల దక్షిణ ధ్రువ ప్రాంతంలో నౌకల సంచారానికి ఎంతో ప్రమాదకరమని శాస్త్రవేత్తలు చెబుతున్నారు సముద్రంలో ఈ హిమ పర్వతం ఏ దిశగా కదులుతుంతో కనిపెట్టాల్సి ఉందని అంటున్నారు. మంచుకొండ విడిపోవడం వల్ల సముద్రమట్టం మూడు మిల్లీమీటర్లు పెరుగుతుందని అంచనా వేస్తున్నారు. విడిపోయిన మంచుకొండ కొన్ని దశాబ్దాల పాటు స్థిరంగా ఉండవచ్చని, లేదా మరిన్ని చిన్న భాగాలుగా విడిపోవచ్చని చెబుతున్నారు.

More Telugu News