: మీ పాత నగలను అమ్మినా జీఎస్టీ బాదేస్తారు!

సామాన్య ప్రజలను అవసరానికి ఆదుకునేది బంగారమే. ఆర్థిక అవసరాలను తీర్చుకోవడానికి బంగారాన్ని తాకట్టు పెట్టడమో, లేదా అమ్మేయడమో చేస్తుంటారు. దీంతో, కష్టాల నుంచి బయటపడే ప్రయత్నం చేస్తుంటారు. తాజాగా కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన జీఎస్టీతో ఇప్పుడు కొత్తగా మరో చిక్కొచ్చి పడింది. మన పాత నగలను అమ్మినా 3 శాతం జీఎస్టీ కట్టాల్సి ఉంటుంది. లక్ష రూపాయల నగలను అమ్మితే రూ. 3వేల జీఎస్టీ పడుతుంది. ఈ విషయాన్ని రెవెన్యూ విభాగం కార్యదర్శి హస్ ముఖ్ అథియా తెలిపారు. అలాగే పాత ఆభరణాలను మార్పులు, చేర్పుల కోసం వ్యాపారికి ఇస్తే... దాన్ని జాబ్ వర్క్ గా పరిగణిస్తారు. దీనిపై 5శాతం జీఎస్టీ పడుతుంది. 

More Telugu News