: టాయిలెట్లకూ ఓ యాప్.. ఢిల్లీలోని 1800 టాయిలెట్ల సమాచారం.. శుభ్రంగా లేకపోతే ఫిర్యాదూ చేయొచ్చు!

ఢిల్లీలోని టాయిలెట్లను గుర్తించేందుకు త్వరలో ఓ యాప్ రాబోతోంది. నగరంలో ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఏర్పాటు చేసిన 1800 పబ్లిక్ టాయిలెట్ల వివరాలు ఇందులో ఉంటాయి. అంతేకాదు.. ఏదైనా టాయిలెట్ పరిశుభ్రంగా లేకపోతే వెంటనే ఫిర్యాదు కూడా చేయవచ్చు. మరో రెండు నెలల్లో ఈ యాప్ అందుబాటులోకి వచ్చే అవకాశం ఉన్నట్టు అధికారులు తెలిపారు. తమకు అందిన ఫిర్యాదులపై వెంటనే ఓ బృందాన్ని అక్కడకు పంపించి పరిశీలించనున్నట్టు పేర్కొన్నారు.

దక్షిణ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 900 పబ్లిక్ టాయిలెట్లు, ఉత్తర ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఆద్వర్యంలో 350, ఈస్ట్ ఢిల్లీ మునిసిపల్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 550 టాయిలెట్లు ఉన్నాయి. టాయిలెట్ల కోసం అందుబాటులోకి రానున్న యాప్‌లో హ్యాపీ, నాట్ హ్యాపీ, శాటిస్‌ఫైడ్ అనే మూడు ఆప్షన్లు కూడా ఉంటాయన్నారు. టాయిలెట్లలో సౌకర్యాల లేమి అంటే నీళ్లు రాకపోవడం, నిర్వహణ లోపాలు, మరమ్మతులపైనా యూజర్లు ఫిర్యాదు చేయవచ్చని ఎంసీడీ అధికారులు వివరించారు.

More Telugu News