: నన్ను హత్య చేయించేందుకు కొందరు 400 కోట్ల సుపారీ ఇచ్చారు: టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు శేఖర్ రెడ్డి

టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు, కాంట్రాక్టర్ శేఖర్ రెడ్డి తనకు ప్రాణ హాని ఉందని, సరైన భద్రత కల్పించాలని కోరుతూ కేంద్రానికి, తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ లేఖల్లో పలు ఆసక్తికర అంశాలు వెల్లడించారు. కోట్లాది రూపాయల కొత్త నోట్లు కలిగి వున్న కేసులో రిమాండ్ ఖైదీగా ఉన్న సమయంలో జైల్లో తనను హతమార్చాలని కొందరు చూశారని ఆయన ఆరోపించారు. ఈ హత్య కోసం 400 కోట్ల రూపాయల సుపారీ కూడా ఇచ్చారని ఆయన వెల్లడించారు. అందుకే తన ప్రాణానికి ప్రమాదం ఉందని, తనకు సరైన భద్రత కల్పించాలని ఆయన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలను ఈ లేఖలో కోరారు.

కాగా, డిసెంబర్ 9, 10 తేదీల్లో ఆదాయపు పన్ను శాఖ అధికారులు జరిపిన సోదాల్లో శేఖర్‌ రెడ్డి బృందం నుంచి 180 కోట్ల రూపాయల నగదు, 178 కిలోల బంగారం, వందల కోట్ల రూపాయల విలువ చేసే ఆస్తులకు సంబంధించిన డాక్యుమెంట్లు, వివిధ పార్టీలకు చెందిన నేతలతో ఆయనకున్న సంబంధాలను తెలిపే పత్రాలు ఐటీ అధికారులకు లభ్యమైన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో తన హత్యకు పథకం రచించారని, ఆ మేరకు సుపారీ కూడా ఇచ్చారని ఆయన తెలిపారు.

More Telugu News