: 'బిగ్ బాస్' షోను బ్యాన్ చేయాలి... క‌మ‌లహాస‌న్‌ను అరెస్టు చేయాలి: హిందూ మ‌క్క‌ల్ క‌చ్చి

సాధారణంగా బిగ్ బాస్ షో అంటే ఏ భాష‌లోనైనా అది వివాదాల‌కు పెట్టింది పేరు. ఇదే క్ర‌మంలో క‌మ‌లహాస‌న్ వ్యాఖ్యాత‌గా త‌మిళంలో అట్ట‌హాసంగా ప్రారంభ‌మైన బిగ్ బాస్ షోను అప్పుడే వివాదాలు వెంటాడుతున్నాయి. ఈ షోను ర‌ద్దు చేయాల‌ని, క‌మ‌లహాస‌న్‌ను అరెస్టు చేయాల‌ని హిందూ మ‌క్క‌ల్ క‌చ్చి అనే స్వ‌చ్ఛంద సంస్థ ప‌ట్టుప‌డుతోంది. షో లో పార్టిసిపెంట్స్ ఉప‌యోగించే భాష‌, వారి వ‌స్త్రధార‌ణే ఇందుకు కార‌ణం.

ముఖ్యంగా న‌మితా, ఓవియాల వ‌స్త్ర‌ధార‌ణ అస‌భ్య‌కరంగా ఉంటోంద‌ని హిందూ మ‌క్క‌ల్ క‌చ్చి చెబుతోంది. ఇక గంజ కురుప్పు, హార‌తిలు మాట్లాడే భాష త‌మిళ హిందూ సంప్ర‌దాయాల‌ను కించ‌ప‌రుస్తున్నాయని, వెంట‌నే వాళ్ల‌ని కూడా అరెస్టు చేయాల‌ని హిందూ మ‌క్క‌ల్ క‌చ్చి డిమాండ్ చేస్తోంది. త్వ‌ర‌లో జూనియ‌ర్ ఎన్టీఆర్ వ్యాఖ్యాతగా తెలుగులో బిగ్‌బాస్ షో ప్రారంభం కానున్న సంగ‌తి తెలిసిందే. ఇక ఈ షో మీద ఎన్ని వివాదాలు వ‌స్తాయో, ఎంత ర‌చ్చ జ‌రుగుతుందో చూడాలి!

More Telugu News