: ప్రతిపక్ష గొర్రెలు, చిల్లరగాళ్లు.. అంటూ సీఎం కేసీఆర్ మండిపాటు!

కాంగ్రెస్ పార్టీ నేతలపై తెలంగాణ సీఎం కేసీఆర్ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. కరీంనగర్ లో మూడో విడత హరితహారం కార్యక్రమాన్ని కేసీఆర్ ఈ రోజు ప్రారంభించారు. అనంతరం, ఆయన మాట్లాడుతూ, గొర్రెల పంపిణీపై ప్రతిపక్షాలు చేస్తున్న విమర్శలపై ఆయన ఓ రేంజ్ లో ఆగ్రహం వ్యక్తం చేశారు.

ప్రతిపక్ష గొర్రెలు, చిల్లరగాళ్లకు అధికారం తప్పా ప్రజాసంక్షేమం పట్టదని, వారి విమర్శలు అర్థరహితమని అన్నారు. ప్రతిపక్ష గొర్రెలకు విమర్శలు చేయడం తప్పా, ఏవైనా చేసిన ముఖాలు, చూసిని ముఖాలా? అంటూ కేసీఆర్ తనదైన శైలిలో విరుచుకుపడ్డారు. 84 లక్షల గొర్రెలను తీసుకువస్తే ఎక్కడైనా పది గొర్రెలు చనిపోవా? ప్రతిపక్షాలు కనీసం ఎనభై నాలుగు వందల గొర్రెలనైనా పంపిణీ చేశారా? అని ప్రశ్నించారు. తెలంగాణలో పేకాట, గుడుంబాను నిర్మూలించామని, గంజాయి, హెరాయిన్ లను చీల్చి చెండాడుతున్నామని, కల్తీ చేస్తే తోలు తీయమని ఆదేశించామని అన్నారు.

 




More Telugu News