: ఇదో రకం సంపాదన: దొంగల ముఠాలకు పిల్లల్ని అద్దెకు ఇస్తున్న తల్లిదండ్రులు!

మధ్యప్రదేశ్ లోని రాజ్ గఢ్ జిల్లాలోని పచోర్, కడియా గ్రామవాసులు తమ పిల్లలను వారే స్వయంగా బాలనేరస్థులుగా మారుస్తున్న దారుణం వెలుగుచూసింది. వీరు తమ పిల్లలను ఢిల్లీ, తదితర పట్టణాల్లో ఖరీదైన వివాహాల్లో దొంగతనాలకు పాల్పడే ముఠాలకు అప్పగించి, వారి నుంచి డబ్బు తీసుకుంటున్నారు. ఈ మేరకు హిందుస్థాన్ టైమ్స్ ఓ కథనాన్ని ప్రచురించింది. మెట్రో నగరాల్లోని పెళ్లి వేడుకల్లో జరుగుతున్న దొంగతనాల కేసుల్లో మైనర్లు ఉంటుండడంతో ఈ వాస్తవం వెలుగులోకి వచ్చింది.

దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు... మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని ఈ రెండు గ్రామాల ప్రజలు తమ పిల్లలను దోపిడీ ముఠాలకు అద్దెకు ఇస్తున్నట్టు గుర్తించారు. ఒక్కో చిన్నారిని అద్దెకు ఇచ్చినందుకు వారి తల్లిదండ్రులకు ఏటా 2-5 లక్షల రూపాయల వరకు ముడుతున్నాయి. పిల్లలను తీసుకెళుతున్న ముఠాలు వారికి చోర విద్యలో శిక్షణనిచ్చి సంపన్నుల వివాహాలలో దొంగతనాలకు పంపిస్తున్నారు. గత మూడు నెలల కాలంలో సుమారు 11 మంది చిన్నారులు ఈ గ్రామాల నుంచి ముఠాలతో తరలివెళ్లినట్టు బయటపడింది.

More Telugu News