pavan: పవన్ మూవీ కోసం త్రివిక్రమ్ సెంటిమెంట్స్!

పవన్ కల్యాణ్ .. త్రివిక్రమ్ కాంబినేషన్ గురించి ప్రత్యేకంగా చెప్పుకోవలసిన పనిలేదు. ఈ ఇద్దరి కాంబినేషన్లో వచ్చిన 'జల్సా' .. ' అత్తారింటికి దారేది' సినిమాల భారీ విజయాలే ఇందుకు కారణం. అలాంటి ఈ కాంబినేషన్లో మరో సినిమా రూపొందుతోంది. ఈ సినిమా కోసం త్రివిక్రమ్ కొన్ని సెంటిమెంట్లను ఫాలో అవుతున్నాడనే టాక్ ఫిల్మ్ నగర్లో వినిస్తోంది.

 గతంలో 'అత్తారింటికి దారేది' సినిమా కోసం పవన్ తో త్రివిక్రమ్ ఒక పాట పాడించాడు. ఆ సాంగ్ జనంలోకి బాగా వెళ్లడం .. ఆ సినిమా బ్లాక్ బస్టర్ కావడం గురించి తెలిసిందే. దాంతో తాజా చిత్రంలోను పవన్ తో ఆయన ఒక పాట పాడించాడట. ఇక 'అత్తారింటికి దారేది' సినిమాలో బొమన్ ఇరాని పాత్ర హైలైట్ గా నిలిచిన సంగతి తెలిసిందే. ఈ సెంటిమెంట్ కారణంగా తాజా చిత్రంలోను ఆయనతో ఒక ముఖ్యమైన రోల్ చేయిస్తున్నాడట. మరి ఈ సెంటిమెంట్స్  ఈ సినిమాకి ఎంతవరకూ కలిసొస్తాయా చూడాలి.   

More Telugu News