: హైద్రాబాదీయులకు స్వైన్ ఫ్లూ భ‌యం!

వ‌ర్షం చినుకు ప‌డ‌గానే ఆహ్లాదంతో పాటు ఆరోగ్య స‌మ‌స్య‌లు కూడా ప్రారంభ‌మ‌వుతాయి. మ‌రీ ముఖ్యంగా వ్యాధినిరోధ‌క శ‌క్తి త‌క్కువ‌గా ఉన్న‌వాళ్ల‌కి ఫ్లూ వంటి వ్యాధులు వచ్చే అవ‌కాశాలు ఎక్కువ‌గా ఉంటాయి. ఈ కాలంలో వ‌చ్చే భ‌యంక‌ర వ్యాధి స్వైన్ ఫ్లూ గురించి హైద‌రాబాదీలు అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని గాంధీ ఆసుప‌త్రి వైద్యులు హెచ్చ‌రిస్తున్నారు. మ‌హ‌బూబ్‌న‌గర్‌కు చెందిన 55 ఏళ్ల వ్య‌క్తికి స్వైన్ ఫ్లూ సోకిన‌ట్లు గాంధీ ఆసుప‌త్రి వైద్యులు గుర్తించారు. దీంతో రానున్న రోజుల్లో అప్ర‌మ‌త్తంగా ఉండాల‌ని స‌ల‌హా ఇచ్చారు. ప్ర‌స్తుతం ఆ పేషెంటుకు చికిత్స చేస్తున్న‌ట్లు తెలిపారు. అలాగే మ‌హ‌బూబ్‌న‌గ‌ర్ వాసుల‌ను, జిల్లా వైద్య యంత్రాంగాన్ని కూడా ఈ విష‌య‌మై అప్ర‌మ‌త్తం చేసిన‌ట్లు వారు చెప్పారు.

More Telugu News