: ముందే కేక్ కోసేసిన కత్రినా... దగ్గరుండి కోయించిన రణబీర్ కపూర్.. ఇదిగో వీడియో

కత్రినా కైఫ్ పుట్టిన రోజుకు ముందుగానే ఆమెతో మాజీ ప్రియుడు రణబీర్ కపూర్ కేక్ కోయించేశాడు. వీరిద్దరూ జగ్గా జాసూస్ సినిమాలో జంటగా నటించగా, ప్రస్తుతం వీరు ఆ సినిమా ప్రచార కార్యక్రమంలో బిజీగా ఉన్న విషయం తెలిసిందే. ఈ సమయంలో కాస్తంత విరామం దొరికింది. ఇంకేముంది, రణబీర్ కు కత్రినా పుట్టిన రోజు గుర్తుకొచ్చేసింది. జూలై 16న ఆమె పుట్టిన రోజు. ఆ తర్వాత మళ్లీ తీరిక దొరకదనుకున్నాడో ఏమోగానీ అప్పటికప్పుడే రణబీర్ మంచి చాక్లెట్ కేక్ తెప్పించేశాడు. హ్యాపీ బర్త్ డే అంటూ రణబీర్ పల్లవి అందుకోగా, కత్రినా కైఫ్ ఉత్సాహంగా ఊగిపోతూ కేక్ కోసింది. ఈ  వీడియోను ఇప్పుడు చాలా మంది లైక్ చేసేస్తున్నారు. మీరూ చూసేయండి.

More Telugu News