: చైనా కీలక నిర్ణయం.. సైనిక బలగాన్ని సగానికి సగం తగ్గించుకోనున్న డ్రాగన్ కంట్రీ?

ప్రపంచంలో అత్యధిక సైనిక బలగం కలిగిన దేశాల్లో ఒకటైన చైనా కీలక నిర్ణయం తీసుకుంది. తన సైనిక బలగాన్ని సగానికి సగం తగ్గించుకోవాలని నిర్ణయించినట్టు చైనా అధికార పత్రిక పీఎల్ఏ డైలీ వెల్లడించింది. ప్రస్తుతం చైనాలో 23 లక్షల మంది సైనికులు ఉన్నారు. వీరి సంఖ్యను 10 లక్షల దిగువకు తీసుకురావాలని చైనా ప్రభుత్వం భావిస్తోంది. అయితే ఇదే సమయంలో నేవీ, మిస్సైల్ ఫోర్స్, స్ట్రాటెజిక్ సపోర్ట్ ఫోర్స్ ను పెంచుకునే ఆలోచనలో ఉంది. అంతర్జాతీయంగా పలు ప్రాంతాల్లో చైనా కార్యకలాపాలు పెరగడంతో ఈ బలగాలను పెంచుకోవాలనుకుంటోంది. 

More Telugu News