: సుబ్రహ్మణ్యంకి పాకిస్థాన్, నైజీరియా, దక్షిణాఫ్రికా నుంచి ఆన్‌లైన్‌లో ఉగ్ర శిక్షణ.. విచారణలో కళ్లు చెదిరే వాస్తవాలు వెల్లడి!

ఉగ్రవాద సంస్థ ఇస్లామిక్ స్టేట్ సానుభూతి పరుడు సుబ్రహ్మణ్యం అలియాస్ ఒమర్‌కు సంబంధించి కళ్లు చెదిరే వాస్తవాలు బయటపడుతున్నాయి. సోషల్ మీడియాను చాలా చక్కగా ఉపయోగించుకున్న ఒమర్‌కు పాకిస్థాన్, నైజీరియా, దక్షిణాఫ్రికా నుంచి ఉగ్రవాదులు ఆన్‌లైన్‌లోనే శిక్షణ ఇచ్చారు. జిహాద్ గురించి వారితో పలుమార్లు చర్చించిన తర్వాతనే సుబ్రహ్మణ్యం ముజాహిద్‌గా మారాలని నిర్ణయించుకున్నట్టు చెప్పాడని పోలీసులు తెలిపారు. తనకు పాస్‌పోర్ట్ లేకపోవడంతో ఇండియా నుంచి వెళ్లలేకపోయానని అతడు వివరించాడు.

‘‘ప్రపంచవ్యాప్తంగా ఉన్న ఐఎస్ ఫైటర్లతో చాట్ చేశా. భారత్‌లో ముస్లింలపై జరుగుతున్న దాడుల గురించి చర్చించుకున్నాం. టెలిగ్రామ్ యాప్ ద్వారా సౌదీలోని అబు ఖహాఫా అల్ హిందీ‌తో మాట్లాడా. పాకిస్థాన్‌కు చెందిన అబు మొహమ్మద్, నైజీరియాకు చెందిన అబ్దుల్ జలీల్ ఓలీజ్, దక్షిణాఫ్రికాలోని జొహెన్నెస్‌బర్గ్‌కు చెందిన అయిది సుమైతో మాట్లాడా. తాలిబన్ గురించి నైజీరియా స్నేహితుడితో చర్చించా. అది చట్టబద్ధమైనదేనా? ఒసామా బిన్ లాడెన్ చేస్తున్నది సరైనదా? కాదా? అనే విషయాలను అతడిని అడిగి తెలుసుకున్నా’’ అని సుబ్రహ్మణ్యం వివరించాడు. ఐఎస్ తర్వాత జైషే మొహమ్మద్, అల్ ఖాయిదా తదితర వాటితో మాట్లాడిన తర్వాతే ముజాహిద్‌గా మారాలని నిర్ణయించుకున్నట్టు పోలీసులకు తెలిపాడు. ప్రస్తుతం సుబ్రహ్మణ్యం హైదరాబాద్ లో జుడీషియల్ కస్టడీలో ఉన్నాడు.

More Telugu News