: గంజాయి దొరక్క ఎమర్జెన్సీ ప్రకటించిన అమెరికా రాష్ట్రం!

గంజాయి విక్రయం చట్టబద్ధమైన వారం రోజులకే అది దొరక్క అమెరికాలోని నెవడా రాష్ట్రం అత్యవసర నియంత్రణను ప్రకటించింది. గంజాయిని చట్టబద్ధం చేసిన వెంటనే రాష్ట్రంలోని 47 అధికారిక గంజాయి రిటైల్ షాపులు నిండుకున్నాయి. డిమాండ్‌కు తగిన ఉత్పత్తి లేకపోవడంతో ట్యాక్సేషన్ డిపార్ట్‌మెంట్ అత్యవసర చర్యలు ప్రకటించింది. లైసెన్స్ కలిగిన డిస్ట్రిబ్యూటర్లు తగినంత మంది లేకపోవడంతో పొలాల నుంచి గంజాయిని సేకరించడం ఇబ్బందిగా మారింది. ఈ ప్రభావం విక్రయాలపై పడింది. డిమాండ్‌కు సరిపడా గంజాయి సరఫరాకు మరికొన్ని రోజుల సమయం పట్టే అవకాశం ఉందని ట్యాక్సేషన్ డిపార్ట్‌మెంట్ అధికార ప్రతినిధి ఒకరు తెలిపారు.

గంజాయి మార్కెట్‌లో డిమాండ్‌ దృష్ట్యా ఈ రంగంలో యజమానులు వందల మిలియన్ డాలర్లను పెట్టుబడిగా పెట్టారు. గంజాయి విక్రయాలు చట్టబద్ధమైన వెంటనే వేలాదిమంది సిబ్బందిని నియమించుకున్నారు. జూలై 1న రాష్ట్రంలో గంజాయి విక్రయాలు ప్రారంభం కాగా, తొలి వారంలోనే ఏకంగా మూడు మిలియన్ డాలర్ల విక్రయాలు జరిగినట్టు అధికారులు తెలిపారు. కాగా, గంజాయిని చట్టబద్ధం చేసిన ఎనిమిదో రాష్ట్రం నెవడా.

More Telugu News