: తేజస్వి యాదవ్ రాజీనామాకు నాలుగు రోజులే డెడ్ లైన్ !

బీహార్ డిప్యూటీ సీఎం, ఆర్జేడి అధినేత లాలూ ప్రసాద్ యాదవ్ కుమారుడు తేజస్వి యాదవ్ కు మంత్రి వర్గం నుంచి ఉద్వాసన తప్పేలా లేదు. తేజస్వి రాజీనామాపై నిర్ణయం తీసుకునేందుకు ఆర్జేడీకి నాలుగు రోజుల డెడ్ లైన్ ను జేడీయూ విధించింది. ఈ సందర్భంగా జేడీయూ నేతల కీలక సమావేశం జరిగింది. తేజస్వి యాదవ్ ను డిప్యూటీ సీఎం పదవి నుంచి తప్పించే విషయాన్ని నాలుగు రోజుల తర్వాత ప్రస్తావిస్తామని ఆ పార్టీ నేత రామైరామ్ ఓ వార్తా సంస్థకు చెప్పినట్టు సమాచారం.

అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న నేపథ్యంలోనే ఆయనను పదవి నుంచి తప్పించాలని చూస్తున్నామని, అటువంటి వ్యక్తులు ప్రజల్లోకి వచ్చి ఎలా వివరణ ఇస్తారని జేడీయూకి చెందిన మరో నేత నీరజ్ కుమార్ పేర్కొన్నారు. అయితే, ఆర్జేడీతో తెగదెంపులు చేసుకోవాలనే ప్రయత్నాలు తాము చేయడం లేదని అన్నారు. కాగా, తేజస్వి రాజీనామా చేయాలనే డిమాండ్లు ఊపందుకున్న తరుణంలో బీహార్ సీఎం, జేడీయూ అధినేత నితీశ్ కుమార్ నివాసంలో ఈ రోజు ఓ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేడీయూ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఆఫీసు బేరర్లు పాల్గొన్నారు.

More Telugu News