srinivas: 'జయ జానకి నాయక' టీజర్ రిలీజ్ రేపే!

బోయపాటి శ్రీను తన సహజమైన శైలికి భిన్నంగా తన తాజా చిత్రానికి 'జయ జానకి నాయక' అనే టైటిల్ ను ఫిక్స్ చేశాడు. అప్పటి నుంచి ఈ సినిమాపై మరింతగా ఆసక్తి .. అంచనాలు పెరిగిపోయాయి. ఇక ఈ సినిమా ఫస్టులుక్ తో యూత్ లో మరింత ఆత్రుతను పెంచడంలో బోయపాటి సక్సెస్ అయ్యాడు.

 ఇప్పుడిక ఈ సినిమా టీజర్ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో ఈ సినిమా నుంచి రేపు ఉదయం 11 గంటల 20 నిమిషాలకి టీజర్ ను రిలీజ్ చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. అందులో భాగంగా స్పెషల్ పోస్టర్ ను కూడా వదిలారు. బెల్లంకొండ సాయి శ్రీనివాస్ - రకుల్ తో కూడిన ఈ పోస్టర్ యూత్ ను ఆకట్టుకునేదిలా వుంది. రేపు విడుదల చేసే టీజర్ తో బోయపాటి ఏ స్థాయి రెస్పాన్స్ రాబడతాడో చూడాలి మరి. 

More Telugu News