: హీరోయిన్ కాజల్ ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందా?

టాలీవుడ్, కోలీవుడ్ లలో అందాల నటి కాజల్ చాలా బిజీగా ఉంది. ఈ మధ్య కాలంలో సరైన హిట్లు లేనప్పటికీ, ఆఫర్లు మాత్రం తగ్గడం లేదు. మరోవైపు, కాజల్ గురించి ఓ ఆసక్తికర వార్త చక్కర్లు కొడుతోంది. మరింత అందంగా కనిపించేందుకు కాజల్ ముక్కుకు ప్లాస్టిక్ సర్జరీ చేయించుకుందనేదే ఆ వార్త సారాంశం. ఇంతకుముందు ఫొటోలతో పోలిస్తే, ఇప్పటి ఫొటోల్లో కాజల్ ముక్కు కాస్త తేడాగా కనిపిస్తోందనే చర్చ జరుగుతోంది. అయితే, ఇంత వరకు ఈ విషయంపై కాజల్ నుంచి ఎలాంటి స్పందన రాలేదు. గతంలో కూడా శ్రుతిహాసన్ ముక్కుకు సర్జరీ చేయించుకుందని, ప్రియాంకచోప్రా పెదవులకు సర్జరీ చేయించుకుందనే వార్తలు షికార్లు చేశాయి. 

More Telugu News