: అమర్ నాథ్ ‘ఉగ్ర’ ఘటనను ఖండించిన అసదుద్దీన్ ఒవైసీ!

అమర్ నాథ్ యాత్రికులపై జరిగిన ఉగ్రవాదుల దాడి ఘటనను ఎంఐఎం అధినేత అసదుద్దీన్ ఒవైసీ ఖండించారు. ఈ రోజు ఆయన మీడియాతో మాట్లాడుతూ, లష్కర్ అయినా, ఐసిస్ అయినా సరే, ఏ ఉగ్రవాద సంస్థను ఎట్టి పరిస్థితుల్లోనూ విజయవంతం కానివ్వమని, దేశమంతా ఐక్యంగా ఉందని అన్నారు. ఉగ్రవాదుల దాడిని హేయమైన చర్యగా పేర్కొన్న అసదుద్దీన్, దాడి విషయమై ఎవరూ రాజకీయాలు చేయొద్దని సూచించారు. దాడి సంఘటనకు సంబంధించిన కొన్ని ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానాలు చెప్పాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా అసదుద్దీన్ పేర్కొన్నారు. కాగా, జమ్మూకశ్మీర్ లోని అనంత్ నాగ్ జిల్లాలో ప్రయాణిస్తున్న అమర్ నాథ్ యాత్రికుల బస్సుపై ఉగ్రవాదులు నిన్న జరిపిన కాల్పుల్లో ఆరుగురు మహిళలు మృతి చెందగా, పలువురు గాయపడ్డారు.

More Telugu News