charan: తమిళ, మలయాళ యంగ్ హీరోలతో కలసి చరణ్ సినిమా?

ఆ మధ్య దర్శకులు మణిరత్నం .. చరణ్ ను కలిసి ఒక కథ వినిపించడం, చరణ్ ఓకే చెప్పేయడం జరిగినట్టుగా వార్తలు షికారు చేశాయి. అయితే, ఆ సినిమా లేనట్టేననే టాక్ ఇటీవల వినిపించింది. ఇక తాజాగా అందుతోన్న సమాచారం ప్రకారం ఆ సినిమా ఉందట. మణిరత్నం సిద్ధం చేస్తోన్న ఆ కథలో చరణ్ తో పాటు దుల్కర్ సల్మాన్ .. ఫహాద్ ఫాజిల్ నటించనున్నట్టు ప్రచారం జరుగుతోంది.

 'ఓకే బంగారం' సినిమా ద్వారా దుల్కర్ సల్మాన్ ఇక్కడి ప్రేక్షకులకు తెలుసు. ఇక మలయాళంలో ఫహద్ ఫాజిల్ పాప్యులర్ హీరోగా కొనసాగుతున్నాడు. ఈ ముగ్గురు హీరోలతో మణిరత్నం సినిమా వుండనుందని అంటున్నారు. నిజంగానే ఈ ప్రాజెక్టు ఉందా? ఉంటే .. మల్టీ స్టారరా? .. ఒక్కో భాషలో ఒక్కో హీరోతో చేయనున్నారా? అనే విషయంలో స్పష్టత రావలసి వుంది.   

More Telugu News