charan: బ్రేకింగ్ న్యూస్: చరణ్ తో కొరటాల మూవీ ఖరారు!

ఆ మధ్య కొరటాల శివతో సినిమా చేయడానికి చరణ్ ఉత్సాహాన్ని చూపించాడు. కొరటాల కూడా అందుకు సంబంధించిన ఏర్పాట్లు చేసుకున్నాడు. ఎందుకోగాని అప్పట్లో ఆ ప్రాజెక్టు పట్టాలెక్కలేదు. మళ్లీ ఈ కాంబినేషన్ సెట్ అయిందనేది తాజా సమాచారం. కొరటాలతో సినిమా చేయబోతున్నట్టు తాజాగా చరణ్ ఫేస్ బుక్ ద్వారా తెలియజేశాడు.

 చరణ్ సొంత బ్యానర్ .. మ్యాటినీ ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్ వారితో కలిసి ఈ సినిమాను నిర్మించనున్నారు. వచ్చే ఏడాది వేసవిలో ఈ సినిమాను సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారట. ప్రస్తుతం చరణ్ .. సుకుమార్ సినిమా 'రంగస్థలం 1985' షూటింగుతో బిజీగా వున్నాడు. ఇక కొరటాల వచ్చేసి .. మహేశ్ బాబుతో 'భరత్ అను నేను' సినిమా చేస్తున్నాడు. ఈ రెండు సినిమాలు పూర్తయ్యాక, ఈ కాంబినేషన్లోని మూవీ పట్టాలెక్కుతుందన్న మాట.    

More Telugu News