: మోదీ, జిన్‌పింగ్ మ‌ధ్య ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేదు!: చైనా ప్ర‌క‌ట‌న‌

ఇటీవ‌లే జ‌ర్మ‌నీలో జ‌రిగిన‌ జీ20 స‌ద‌స్సు నేప‌థ్యంలో భార‌త విదేశాంగ శాఖ అధికార ప్ర‌తినిధి గోపాల్ బాగ్లే రెండు రోజుల క్రితం భార‌త్, చైనా అగ్ర‌నేత‌లు క‌ర‌చాల‌నం చేసిన ఫొటోను పోస్ట్ చేసిన విష‌యం తెలిసిందే. ఈ క్ర‌మంలో ఆయ‌న‌ వివిధ అంశాల‌పై మోదీ, జిన్‌పింగ్‌ మాట్లాడుకున్నారని కూడా పేర్కొన్నారు. అయితే, చైనా మాత్రం ఈ విష‌యంపై అతిగా స్పందిస్తూ మోదీ, జీ జిన్‌పింగ్ మ‌ధ్య ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేద‌ని ప్ర‌క‌టన చేసుకుంది.

చైనా విదేశాంగ శాఖ‌ అధికార ప్ర‌తినిధి గెంగ్ షువాంగ్ మాట్లాడుతూ.. ఇదే విష‌యాన్ని ప‌దేప‌దే మీడియా ముందు చెప్పారు. సాధార‌ణంగా ద్వైపాక్షిక చ‌ర్చ‌లు జ‌రిగితే ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటారు కానీ, చ‌ర్చ‌లు జ‌ర‌గ‌లేద‌ని కూడా చైనా ఇలా ప్ర‌క‌ట‌న‌లు చేసుకుంటుండం విశేషం.  

More Telugu News