: `ఇరాన్ ఎయిర్‌` సీఈఓగా తొలిసారిగా ఎంపికైన మ‌హిళ‌!

మ‌హిళ‌ల‌పై ఎన్నో ఆంక్ష‌లు విధించే ముస్లిం దేశాల్లో ఇరాన్ ఒక‌టి. అలాంటి దేశంలో జ‌న్మించి, క‌ష్ట‌ప‌డి చ‌దువుకుని ఆ దేశ జాతీయ ఎయిర్‌లైన్స్‌కి సీఈఓగా మార‌డం అంటే సాధార‌ణ విష‌యం కాదు. ఫ‌ర్జానా ష్రాఫ్‌బ‌ఫీ, ఆమిర్ క‌బీర్ యూనివ‌ర్సిటీ, షాహిద్ స‌త్తారి యూనివ‌ర్సిటీ ఆఫ్ ఎరోనాటిక‌ల్ ఇంజినీరింగ్‌ విద్యా సంస్థల్లో ప్రొఫెస‌ర్‌గా ప‌నిచేస్తున్న ఈమె ఇరాన్ ఎయిర్ సీఈఓగా ఎంపిక‌య్యారు. దీంతో ఈ ఎయిర్‌లైన్స్‌కు సీఈఓగా ఎంపికైన మొద‌టి మ‌హిళ‌గా ఫ‌ర్జానా రికార్డుకెక్కారు. మొద‌ట్నుంచి సైన్స్ అంటే ఇష్టపడే ఫ‌ర్జానా, త‌న‌కు పెళ్లై, పిల్ల‌లు పుట్టిన త‌ర్వాత కూడా పీహెచ్‌డీ పూర్తిచేశారు. రెండో సంతానం క‌లిగిన రెండో రోజు కూడా త‌ను చ‌దువు కోవ‌డానికి కాలేజీకి వెళ్లిన‌ట్టు ఆమె ఒక ఇంట‌ర్వ్యూలో తెలిపారు. ఈమె సాధించిన ఘ‌న‌త‌తో ఇరాన్‌లో మ‌హిళా సాధికార‌త మ‌రో మెట్టు ఎక్కే అవ‌కాశం క‌నిపిస్తోంది.

More Telugu News