: మాల్యా, లలిత్ మోదీల విషయంలో మీరు కల్పించుకోవాల్సిందే!: బ్రిటన్ ప్రధానితో నరేంద్ర మోదీ

ఇండియాలో నేరాలకు పాల్పడి ప్రస్తుతం బ్రిటన్ లో ఆశ్రయం పొందుతున్న విజయ్ మాల్యా, లలిత్ మోదీలను భారత్ కు అప్పగించడంలో సహకరించాలని బ్రిటన్ ప్రధాని థెరిసా మేను భారత ప్రధాని నరేంద్ర మోదీ కోరారు. జీ-20 సదస్సులో పాల్గొంటున్న ఆయన హాంబర్గ్ లో థెరిసాను కలిశారు. గత సంవత్సరం, మార్చిలో మాల్యా లండన్ పారిపోయారని, ప్రస్తుతం వారెంట్ల నుంచి తప్పించుకుంటున్నారని గుర్తు చేసిన మోదీ, భారత బ్యాంకులకు మాల్యా 9 వేల కోట్ల రూపాయలు బకాయి పడ్డారని తెలిపారు.

ఇక ఇండియన్ ప్రీమియర్ లీగ్ పోటీలు తన ఆధ్వర్యంలో జరుగుతున్నప్పుడు లలిత్ మోదీ అవినీతికి పాల్పడ్డారని తెలిపారు. వారిద్దరూ ఇప్పుడు లండన్ లోనే ఉన్నారని, వారిని అప్పగించాలని కోరారు. వారి అప్పగింతకు ప్రధాని హోదాలో కల్పించుకోవాలని అడిగారు. ఈ మేరకు థెరిసా మేతో జరిగిన ప్రత్యేక భేటీలో మోదీ విజ్ఞప్తి చేయగా, విషయం తనకు తెలియదని, పరిశీలిస్తానని ఆమె వెల్లడించినట్టు సమాచారం.

More Telugu News