: ‘బిగ్‌బాస్’ షో చేయాలని ఆయనే నన్ను ఒప్పించారు: యంగ్ టైగర్ ఎన్టీఆర్
యంగ్ హీరో జూనియర్ ఎన్టీఆర్ హోస్ట్‌గా 'స్టార్ మా' చానెల్ లో ప్రసారం కానున్న రియాలిటీ షో ‘బిగ్‌బాస్’ లాంఛింగ్ కార్యక్రమం ఈ రోజు జరిగిన విషయం తెలిసిందే. ఈ సందర్భంగా ఎన్టీఆర్ మాట్లాడుతూ.. తనను ఈ ‘బిగ్‌బాస్’ షో చేయడానికి ఎవరు ఒప్పించారనే విషయాన్ని చెప్పారు. మా టీవీలో పనిచేసే రఘు అనే ఓ వ్యక్తి తనను బిగ్‌బాస్‌కు హోస్ట్ చేయాలని అడిగారని ఎన్టీఆర్ పేర్కొన్నారు. తన మీద ఎంతో నమ్మకం పెట్టుకున్న రఘు వల్లే తాను ఈ షో చేయడానికి ఒప్పుకున్నానని అన్నారు. రఘుకు తాను కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఎన్టీఆర్ పేర్కొన్నారు. తారక్ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తోన్న ఈ షో కోసం బుల్లితెర ప్రేక్షకులు వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు.