: రజనీకాంత్ ఫిట్... ధ్రువీకరించిన అమెరికా వైద్యులు!

కోలీవుడ్ సూపర్‌ స్టార్‌ రజనీకాంత్‌ పెద్దకుమార్తె ఐశ్వర్యతో కలిసి వైద్య పరీక్షల నిమిత్తం అమెరికాకు వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో ఆయన వైద్యపరీక్షలు చేయించుకున్నారు. ఆయనను పరీక్షించిన వైద్యులు ఆయన ఆరోగ్యం బాగానే ఉందని, ఫిట్‌ గా ఉన్నారని ధ్రువీకరించినట్టు తెలుస్తోంది. తాజాగా తాను ఆరోగ్యంగా ఉన్నానన్న విషయాన్ని వెల్లడిస్తూ అభిమానితో దిగిన సెల్పీ వీడియో ఒకటి సోషల్ మీడియాలో పోస్టు చేయగా, అది వైరల్ అయింది.

కాగా, రజనీ రాజకీయ రంగప్రవేశంపై తీవ్ర ఉత్కంఠ నెలకొన్న సమయంలో ఆయన ఫిట్ గా ఉన్నారన్న వార్త ఆయన అభిమానులకు శుభవార్తే. వచ్చేవారం కుమార్తెతో కలిసి చెన్నై రానున్న తలైవా... చెన్నైలో తన రాజకీయ రంగప్రవేశంపై ప్రకటన చేసే అవకాశం ఉందని అంతా ఆసక్తిగా చర్చించుకుంటున్నారు. 

More Telugu News