: వ్యూహం మార్చి కొత్త నాటకానికి తెరతీసిన చైనా!

సిక్కిం సరిహద్దుల్లోకి చొరబడడం ద్వారా ఉద్రిక్తతలు రేపుతూ మీడియాలో అసత్య కథనాలు రాయిస్తూ, రాయబారులు, విదేశాంగ శాఖ ప్రతినిధులతో ప్రకటనలు చేయిస్తూ ఉద్రిక్తతలు రేపుతున్న చైనా ఇప్పుడు వ్యూహం మార్చింది. భారత్ కు అంతర్జాతీయ మద్దతు దక్కకుండా జాగ్రత్తపడే ప్రయత్నంలో పడింది. జర్మనీలో భారత్ తో జిన్ పింగ్ చర్చలు జరిపేది లేదని చైనా తేల్చి చెప్పిన సంగతి తెలిసిందే. ఈ మేరకు ఆ దేశ విదేశాంగ ప్రతినిధి ప్రకటన చేయగా, భారత్ కూడా చైనాతో చర్చల కోసం భారత్ ఎదురు చూడడం లేదని స్పష్టం చేసిన సంగతి తెలిసిందే.

అయితే అలా చేస్తే భారత్ లాభపడే అవకాశం ఉందని భావించిన చైనా తాజాగా వ్యూహం మార్చింది. సిక్కిం సరిహద్దుల్లో బలప్రయోగానికి పాల్పడుతూ, మరోపక్క అంతర్జాతీయ సమాజం ముందు చర్చల నాటకాన్ని ప్రారంభించింది. జర్మనీలో జీ20 సదస్సులో మోదీని నవ్వుతూ పలకరించిన జీ జిన్ పింగ్ ఆయనతో సమావేశమయ్యారు. దీంతో చైనా వైఖరిపై ఆగ్రహం వ్యక్తమవుతోంది. దోస్తీ అంటూనే వెన్నుపోటు పోడిచేందుకు సిద్ధమవుతోందని పరిశీలకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

More Telugu News