: పాక్‌ను కడిగిపారేసిన మోదీ.. రాజకీయ లక్ష్యాల కోసం ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటోందన్న భారత ప్రధాని

జి-20 సదస్సులో భారత ప్రధాని నరేంద్ర మోదీ పాకిస్థాన్‌ను తూర్పారబట్టారు. లష్కరే తాయిబా, జేఈఎం, ఐఎస్, బొకో హరామ్ వంటి ఉగ్రవాద సంస్థల గురించి చెబుతూ ఇవన్నీ ఒకే భావజాలంతో వివిధ పేర్లతో పనిచేస్తున్నాయన్నారు. ప్రపంచవ్యాప్తంగా వేళ్లూనుకుపోయిన ఉగ్రవాదాన్ని కూకటి వేళ్లతో పెకలించేందుకు 11 పాయింట్ల యాక్షన్ అజెండాను మోదీ ప్రదర్శించారు.

కొన్ని దేశాలు తమ రాజకీయ లక్ష్యాలను చేరుకునేందుకు ఉగ్రవాదాన్ని ఉపయోగించుకుంటున్నాయని పాక్‌ను ఉద్దేశించి అన్నారు. మోదీ 11 పాయింట్ల అజెండాలో జీ-20 దేశాల మధ్య ఉగ్రవాదుల జాబితా మార్పిడి, చట్టపరమైన చర్యలను మరింత విస్తృతం చేసుకోవడం, సులభతరం చేసుకోవడం, నిధులు, ఆయుధాల సరఫరాపై ఉక్కుపాదం మోపడం తదితర అంశాలు ఉన్నాయి. ఈ సందర్భంగా మోదీ మాట్లాడుతూ బ్రిక్స్ దేశాలు తమ నాయకత్వాన్ని ఉగ్రవాదంపై పోరాటంతో చూపాలని పిలుపునిచ్చారు.

More Telugu News