: మోదీ ఇజ్రాయెల్ పర్యటనతో తీవ్ర ఆందోళనకు గురవుతున్న పాకిస్థాన్

భారత ప్రధాని మోదీ చేపట్టిన ఇజ్రాయెల్ పర్యటనతో పాకిస్థాన్ బెంబేలెత్తిపోతోంది. రెండు దేశాల మధ్య బలంగా ఉన్న బంధాన్ని చూసి వణుకుతోంది. రెండు దేశాలు కలసి పాక్ కు వ్యతిరేకంగా కుట్రలు చేస్తాయని భయపడుతోంది. భారత్, ఇజ్రాయెల్ దేశాధినేతలు ఇద్దరూ కలసి పాక్ కు వ్యతిరేకంగా కుట్రలు పన్నుతున్నారని... తమ దేశాన్ని అల్లకల్లోలం చేసేందుకు భారత్, ఇజ్రాయెల్ లు ఎప్పటి నుంచో ప్రయత్నిస్తున్నాయని పాక్ విదేశాంగ శాఖకు చెందిన ఓ సీనియర్ అధికారి తెలిపారు. ఈ రెండు దేశాలు కలసి పాక్ కు వ్యతిరేకంగా కచ్చితంగా కుట్రలు పన్నుతుంటాయని పాక్ ప్రధాని షరీఫ్ ప్రత్యేక సలహాదారు ఆసిఫ్ కిర్మాణీ కూడా అన్నారు.

మోదీ పర్యటన నేపథ్యంలో భారత్, ఇజ్రాయెల్ మధ్య రూ. 10,400 కోట్ల విలువైన రక్షణ ఒప్పందాలు జరిగాయి. ఇది పాక్ ను ఆందోళనకు గురి చేస్తోంది. ఇప్పటి వరకు భారత ప్రధాని ఎవరూ ఇజ్రాయెల్ కు వెళ్లలేదని... తొలిసారి మోదీ వెళ్లడం వెనక కచ్చితంగా మతలబు ఉందని పాక్ ఆందోళన చెందుతోంది. 

More Telugu News